Minister Gottipati Ravi Interesting Comments : ప్ర‌తీ ఏటా డీఎస్సీ నిర్వ‌హిస్తాం మాట నిల‌బెట్టుకున్నాం

356 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి

Hello Telugu - Minister Gottipati Ravi Interesting Comments

Hello Telugu - Minister Gottipati Ravi Interesting Comments

Gottipati Ravi  : అద్దంకి : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Gottipati Ravi) స్ప‌ష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో సేవలందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా రాజకీయ వాతావరణానికి దూరంగా చేస్తున్నామని చెప్పారు మంత్రి. గత ప్రభుత్వంలో మాదిరిగా ఏ కార్యక్రమంలో కూడా రాజకీయ నాయకులు ఫోటోలు, పార్టీ గుర్తులు, రంగులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

AP Minister Gottipati Ravi Comments

గతంతో పోల్చితే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. శనివారం అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన 356 విద్యార్థులకు సైకిళ్ల ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉచితంగా పంపిణీ చేశారు. SEIL Energy India Limited సీఎస్ఆర్ నిధుల సహకారంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1000 సైకిళ్లు అందించనున్నట్లు వివరించారు. ఇప్పటికే దాతల సహకారంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అనంతరం దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాలును మంత్రి ప్రారంభించారు. అంతేగాకుండా రూ.15.58 లక్షలతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించారు.

Also Read : MLA Palla Srinivasa Rao Shocking Comments : బొత్సకు జగన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది

Exit mobile version