Palla Srinivasa Rao : మంగళగిరి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు (Palla Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు తన పార్టీకి చెందిన బాస్ , మాజీ సీఎం జగన్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందన్నారు . బొత్స సత్యనారాయణ అంటే తమకు చాలా గౌరవం ఉందన్నారు. తనకు ప్రాణహాని ఉందని బొత్స ప్రకటించారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా బొత్సకు ఎటువంటి భయం అవసరం లేదన్నారు. బొత్స మాటలను బట్టి చూస్తే. జగన్ రెడ్డి వల్లే బొత్సకు ప్రాణహాని ఉందని అనిపిస్తోందన్నారు. జగన్ రెడ్డిని దాటి వెళ్లినా, పార్టీలో ఆయనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకొన్నా వాళ్లని అంతం చేస్తాడని మండిపడ్డారు. వైఎస్ వివేకాను ఆ కారణంగానే హత్య చేశాడని అన్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారని,. మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స పనితీరు బాగుందన్నారు. బొత్సకు కావాలంటే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నామని ప్రకటించారు.
MLA Palla Srinivasa Rao Shocking Comments on Botacha Security
శనివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీసీఎస్, మహేంద్ర, లూలూ, రిలయన్స్, ఎన్టీపీసీ గ్రీన్ టెక్ హైడ్రోజన్, వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు వల్లే అన్నారు. విశాఖకు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రాబోతోందని చెప్పారు. విశాఖలో సిఫిఏఐకి సంబంధించి ఒక డేటా సెంటర్ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రారభించబోతున్నారని తెలిపారు. ఢిల్లీలో గూగూల్ కు చెందిన రైడెన్ తో రూ.87,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోబోతున్నామని పేర్కొన్నారు.
Also Read : Pawan Kalyan Important Comments : పుస్తకాల పఠనం మానసిక దృఢత్వానికి మార్గం
