Minister Gottipati Ravi Kumar Clear Instructions : ప్ర‌తి ఇంటికీ సంక్షేమ ప‌లాలు అందాలి

పిలుపునిచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

Hello Telugu - Minister Gottipati Ravi Kumar Clear Instructions

Hello Telugu - Minister Gottipati Ravi Kumar Clear Instructions

Gottipati Ravi Kumar : అమ‌రావ‌తి : తెలుగుదేశం కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌తి ఇంటికి చేరువ కావాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ (Gottipati Ravi Kumar). సంత మాగులూరు మండలం పుట్టావారి పాలెం అతిథి గృహంలో వెలమవారిపాలెం, కొత్తూరు, గొర్రెపాడు, కూకట్లపల్లి గ్రామాల తెదేపా శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణం, బూత్ స్థాయి బలగాల బలోపేతం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల అమలు వంటి అంశాలను విపులంగా సమీక్షించడం జ‌రిగింద‌ని చెప్పారు. గ్రామస్తుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలులో ఏర్పడుతున్న చిన్నపాటి ఇబ్బందులను కూడా కార్యకర్తలు వివరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను వెంటనే ఆదేశిస్తూ తక్షణ చర్యలు తీసుకునేలా సూచనలు అందజేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

MInister Gottipati Ravi Kumar Comments

ప్రజలతో మమేకం అవుతూ ప్రతి ఇంటికి తెదేపా ప్రభుత్వ సంకల్పాలను చేర వేయాలని, గ్రామ స్థాయిలో సమన్వయం మరింత బలపడేలా పనిచేయాలని కార్యకర్తలను కోరారు. రాబోయే నెలల్లో చేపట్టబోయే పార్టీ ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా వివరిస్తూ, అందరూ ఒక్కటిగా పని చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌మ సంకీర్ణ‌, డబుల్ ఇంజిన్ స‌ర్కార్ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌న్నారు. ఎక్క‌డా లేని రీతిలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును నిర్వ‌హించడం జ‌రిగింద‌ని చెప్పారు.

Also Read : DY CM Bhatti Vikramarka Interesting Comments : డిసెంబ‌ర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

Exit mobile version