Bhatti Vikramarka : హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ నెలలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక పరిశీలనలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka). ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం అన్నారు. మొదటి సంవత్సరం సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పామన్నారు.
DY CM Bhatti Vikramarka Comments
ఈ రెండవ సంవత్సరం సాధించిన విజయాలతో పాటు 20 47 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకుందని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క. 2047 వరకు తెలంగాణ ఏరకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి అనే విషయాలను ప్రజా ప్రభుత్వం వివరిస్తుందన్నారు. భవిష్యత్తును చాటి చెప్పేందుకు నగరానికి నలు దిక్కులా అవసరమైన వేదికలను పరిశీలిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. భారత్ ఫీచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి, దుండిగల్ తదితర ప్రాంతాలను వేదికల కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాదు పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం. అద్భుతమైన వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయి అని గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ వ్యాప్తంగా తరలివస్తున్న పారిశ్రామికవేత్తలకు వివరిస్తామన్నారు.
Also Read : IBomma Founder Ravi Arrest Interesting : ఛాలెంజ్ చేశాడు చంచల్ గూడ జైలు పాలయ్యాడు
