Minister Damodara Raja : హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వేచ్ఛ లభించిందని, అన్ని వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ (Minister Damodara Raja). దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఆయన కోరారు. అభివృద్ది , సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు వెళుతున్నామని, దీని ద్వారా ప్రజా పాలన కొనసాగుతోందని చెప్పారు దామోదర రాజ సరనింహ. అంతకు ముందు ఎర్రగడ్డ డివిజన్ లోని ప్రేమ్ నగర్ లో ఉన్న కింగ్ గొస్పెల్ చర్చి లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
Minister Damodara Raja Narasimha Comments
గతంలో రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. 10 ఏళ్లపాటు రాచరిక పాలన సాగించారని ఆరోపించారు. అందుకే జనం తట్టుకోలేక కాంగ్రెస పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. తాము వచ్చాక మహిళలకు ఉచితంగా బస్సు పథకాన్ని తీసుకు వచ్చామన్నారు. 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు మంత్రి దామోదర రాజ నరసింహ. ఈ కార్యక్రమం లో శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , చైర్మన్ లు అమిత్ రెడ్డి , వెంకట్రామ్ రెడ్డి , తాహేర్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : Rahul Gandhi Strong Demand : బీహార్ కు నితీష్ కుమార్ ఏం చేశారో చెప్పాలి..?
