Minister Damodar Shocking Comments : ఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు

ఆదేశించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర

Hello Telugu - Minister Damodar Shocking Comments

Hello Telugu - Minister Damodar Shocking Comments

Minister Damodar  : హైద‌రాబాద్ : ల‌క్ష‌లాది మంది పేద‌లు, సామాన్యుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డంలో తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లా లోని ఎంజీఎం ఆస్ప‌త్రి టాప్ లో కొన‌సాగుతోంది. అయితే ఈ మ‌ధ్య‌న వ‌రుస వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ప్ర‌ధానంగా ఈ ప్రధాన ఆస్పత్రిలో ఘ‌ట‌న‌ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా స‌ర్కార్ గాడి త‌ప్పింద‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు. ఇదే స‌మ‌యంలో సంబ‌ధిత వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌కు (Minister Damodar ) తెలియ‌కుండానే బ‌దిలీలు జ‌రుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే క్ర‌మంలో సీఎం వ‌ర్సెస్ దామోద‌ర‌, ఇత‌ర మంత్రులుగా చీలి పోయారు. ఈ విష‌యం ఇటీవ‌లే బ‌య‌ట ప‌డింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి.

Minister Damodar Raja Narasimha Shocking Comments

ఈ సంద‌ర్బంగా ప్రతిష్టాత్మక వరంగల్ ఎం జీ ఎం హాస్పిటల్ లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు, వివాదాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..వెంటనే సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. అంతేకాదు సుదీర్ఘ కాలం హాస్పిటల్ లో పాతుకు పోయిన వైద్యాధికారులు, సిబ్బంది వివరాలు తెప్పించాలని స్ప‌ష్టం చేశారు. ఈ వివ‌రాల‌న్నీ కొన్ని గంట‌ల్లోనే త‌న కార్యాల‌యానికి అంద‌జేయాల‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మంత్రి తీసుకున్న నిర్ణ‌యం వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో క‌ల‌క‌లం రేపింది.

Also Read : CP Sajjanar Shocking Rowdy Sheeters : రౌడీ షీట‌ర్ల‌కు సీపీ స‌జ్జ‌నార్ చెక్

Exit mobile version