జీడీపీ వృద్ది రేటుపై ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి

20 సూత్రాల అమ‌లు చైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ ఆరోప‌ణ‌లు

hellotelugu-LankaDiinakar

అమ‌రావ‌తి : ఇరవై సూత్రాల కార్యక్రమం’ (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై . ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆయా పార్టీల నేత‌ల‌కు అల‌వాటుగా మారింద‌న్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. జీడీపీ వృద్ధి రేటుపై ప్రజలను కాంగ్రెస్, వామపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. 2022–23ని కొత్త ఆధార సంవత్సరంగా ఎంపిక చేయడం అనేది రాజకీయ నిర్ణయం కాదని అన్నారు. వివిధ సంవత్సరాలను పరిశీలించిన తర్వాత ‘జాతీయ ఖాతాల గణాంకాలపై సలహా కమిటీ’ చేసిన సిఫార్సు అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో జీడీపీ గణాంకాల విషయంలో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్ నాయకులు, వామపక్ష సానుభూతిపరులు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని విమర్శించారు.

అధికారికంగా నమోదైన 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును 2.6 శాతంగా చూపించేందుకు పాత (2011–12) , కొత్త (2022–23) జీడీపీ శ్రేణులను కలిపి చూపడం అనేది ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో కూడిన రాజకీయ ప్రచారమని అన్నారు. వృద్ధిని ఒకే జీడీపీ శ్రేణి, ఒకే ఆధార సంవత్సరం , స్థిరమైన పద్ధతి , పోల్చదగిన ధరల ఆధారంగా లెక్కించాలి అని దినకర్ అన్నారు. 2011–12 శ్రేణి నుండి 2025–26 గణాంకాలను, 2022–23 శ్రేణి నుండి 2026–27 గణాంకాలను తీసుకుని, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాస్తవ జీడీపీ వృద్ధి”గా చూపించడం శాస్త్రీయంగా సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. 2022–23ని కొత్త ఆధార సంవత్సరంగా ఎంచుకోవడం అనేది రాజకీయ నిర్ణయం కాదని, వివిధ సంవత్సరాలను పరిశీలించిన తర్వాత ‘జాతీయ ఖాతాల గణాంకాలపై సలహా కమిటీ’ చేసిన సిఫార్సు అని ఆయన చెప్పారు.

Exit mobile version