మసీదు కూల్చివేతపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్

తీవ్రంగా ఖండించిన హైద‌రాబాద్ ఎంపీ

hellotelugu-owaisi

హైద‌రాబాద్ : ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు సహరాన్‌పూర్ కలెక్టరేట్‌లోని మసీదును కూల్చి వేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హామీ ఇక ముస్లింలకు వర్తించదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బలహీనమైన కారణాలతో త‌మ‌ ప్రార్థనా స్థలాలను ఎందుకు పదేపదే బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారంటూ భ‌గ్గుమ‌న్నారు. 1911 నాటి చారిత్రక రికార్డులు ఆ ప్రార్థనా స్థలం ఉనికిని ధృవీకరిస్తున్నాయని పేర్కొన్న ఆయన మీకు ఏదో అనిపించినంత మాత్రాన మా మసీదును బుల్డోజర్లతో కూల్చి వేయలేరు అని మండిప‌డ్డారు. ఉదయం 5 గంటల సమయంలో జరిగిన ఈ కూల్చివేత ఘటనపై ఎక్స్ సామాజిక వేదికగా స్పందించాడు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ రక్షణపై ప్రశ్నలు లేవనెత్తారు. మసీదు ఉనికిని నిరూపించడానికి మసీదు కమిటీ 1911 నాటి రికార్డులను సమర్పించిందని, అక్కడ ఒక శతాబ్దానికి పైగా నిరంతరాయంగా ప్రార్థనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మసీదు ఉనికిని ధృవీకరించడానికి మసీదు కమిటీ 1911 నాటి రికార్డులను సమర్పించింది. అక్కడ ఒక శతాబ్దానికి పైగా నిరంతరాయంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది చట్టం ప్రకారం ఇప్పటికీ వక్ఫ్‌గానే పరిరక్షించ బడుతోంది అని అస‌దుద్దీన్ ఓవైసీ స్ప‌ష్టం చేశారు. ఆస్తిపై ప్రభుత్వం చేస్తున్న వాదనను ఒవైసీ ప్రశ్నించారు. స్థిరాస్తికి సంబంధించిన కాలపరిమితి , స్వాధీనత నిబంధనలను ప్రస్తావించారు. ఒక రోజు ఉదయం నిద్రలేచి స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడానికి ప్రభుత్వానికి అపరిమిత సమయాన్ని లిమిటేషన్ యాక్ట్ సాధారణంగా అనుమతించదు అని ఆయన అన్నారు. ఆస్తి యొక్క చట్టపరమైన స్థితిని నిర్ణయించేటప్పుడు దానిపై ఉన్న దీర్ఘకాలిక స్వాధీనతను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన వాదించారు.

ఒక శతాబ్దానికి పైగా బహిరంగ, నిరంతర, అందరికీ తెలిసిన స్వాధీనత అక్కడ ఉందన్నారు. ఈ స్వాధీనత నిన్ననే మొదలైందని ప్రభుత్వం నటించ లేదని పేర్కొన్నారు ఓవైసీ.

Exit mobile version