Minister Azharuddin : హైదరాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ (Minister Azharuddin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా కొలువు తీరిన తర్వాత దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం శ్రమించారు. మీరు ఓట్లు వేసి గెలిపించక పోతే తాను ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టబోమని సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అజహరుద్దీన్ తెలంగాణ వక్ఫ్ బోర్డు పనితీరుపై సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బి. షఫియుల్లా, తెలంగాణ వక్ఫ్ బోర్డు సిఇఒ మహ్మద్ అసదుల్లా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Minister Azharuddin Focus
సమీక్ష సందర్భంగా మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ కీలక సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దంటూ సూచించారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కీలక అంశాలు, పరిపాలనా సంస్కరణలు, బోర్డు పనితీరును బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై మంత్రి చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాలని ఆదేశించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం పూర్తిగా వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. వక్ఫ్ ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అజహరుద్దీన్.
Also Read : DY CM Pawan Kalyan Clear Instructions : అటవీ భూముల ఆక్రమణదారుల వివరాలు వెల్లడించాలి
