DY CM Pawan Kalyan Clear Instructions : అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణదారుల వివ‌రాలు వెల్లడించాలి

వెబ్ సైట్ లో ఉంచాల‌ని ఆదేశించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్

Hello Telugu - DY CM Pawan Kalyan Clear Instructions

Hello Telugu - DY CM Pawan Kalyan Clear Instructions

Pawan Kalyan : అమ‌రావ‌తి : ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అట‌వీ భూములు ఆక్ర‌మించిన వారిపై ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా ఎవ‌రు ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ్డారో వారి వివ‌రాలు సంబంధిత శాఖ వెబ్ సైట్ లో పొందుప‌ర్చాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్డులను ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయని ప్ర‌శ్నించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాజకీయాలకు అతీతంగా భావి తరాలకు ప్రకృతి సంపద అందించాలని స్ప‌ష్టం చేశారు.

DY CM Pawan Kalyan Comments

అటవీ భూములు ప్రకృతి సంపద జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతార‌ని , జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని స్పష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు.

Also Read : Minister Ponnam Prabhakar Strong Focus : ఆర్టీసీ అద‌న‌పు ఆదాయంపై దృష్టి సారించాలి

Exit mobile version