Minister Azharuddin : హైదరాబాద్ : మక్కా సందర్శన కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో కాలి పోయింది. ఈ ఘటనలో ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వారంతా సజీవ దహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్ర మైనారీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin). సౌదీ విషాదం తర్వాత హజ్ హౌస్‌లో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు పాల్గొన్న విషాదకరమైన బస్సు ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.
Minister Azharuddin Comments
జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరితో మంత్రి అజారుద్దీన్ స్వయంగా మాట్లాడారు. గాయపడిన యాత్రికులకు సాధ్యమైనంత సహాయం అందించాలని , సహాయక చర్యలను త్వరగా , సమర్థవంతంగా సమన్వయం చేయాలని ఆయనను అభ్యర్థించారు. మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌లో ఉన్నారు, అక్కడ ఆయన సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కంట్రోల్ రూమ్ పనితీరును పర్యవేక్షిస్తున్నారు . మృతుల కుటుంబాలకు సంబంధించి ఏవైనా సమాచారం కావాలంటే ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. 79979 59754, 99129 19545 అనే నంబర్లను సంప్రదించాలని కోరారు.
Also Read : Temba Bavuma Shocking Comments : సమిష్టిగా ఆడాం భారత్ పై గెలుపొందాం
