Minister Atchannaidu Important Updates : గంగ పుత్రుల‌ను ఆదుకుంటాం : అచ్చెన్నాయుడు

ప‌లు డెయిరీ సంస్థ‌ల అవినీతిపై చ‌ర్య‌లు తీసుకుంటాం

Hello Telugu - Minister Atchannaidu Important Updates

Hello Telugu - Minister Atchannaidu Important Updates

Minister Atchannaidu : అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఉన్న గంగ పుత్రుల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). శ‌నివారం శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. 2014-2019 తెదేపా ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌త్స్య‌కారులకు స్వ‌ర్ణ యుగంగా న‌డించింద‌న్నారు. రూ. 4000 వేట నిషేధ‌ భృతిని అంద జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో 20,000 అంద చేస్తున్నామని పేర్కొన్నారు. ఎగ్జిబిష‌న్స్ ఏర్పాటు చేసి మ‌త్స్య‌కారుల‌కు కావ‌ల‌సిన మౌలిక స‌దుపాయాల‌ను వారికి న‌చ్చిన విధంగా అంద చేశామ‌న్నారు. వైసీపీ హ‌యాంలో మ‌త్స్య‌కారులు ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని అనుభ‌వించారని ఆరోపించారు. మౌలిక వ‌స‌తులు క‌ల్పించ లేక పోవ‌డంతో ఆర్దికంగా మ‌త్స్య‌కారులు న‌ష్ట పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Minister Atchannaidu Comments

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కానికి తూట్లు పొడిచి వైసీపీ ప్ర‌భుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడికి తెగ‌బ‌డింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఫిష్ ఆంధ్ర కోసం 155.69 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించార‌ని, కానీ కేవ‌లం 51.44 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని, దీని వెనుక మ‌ర్మ‌మేంటి అని ప్ర‌శ్నించారు . ఫిష్ ఆంధ్ర వ‌ల‌న మ‌త్స్య‌కారుల‌కు ఎలాంటి ఉప‌యోగం లేద‌న్నారు..న‌గ‌దు దోచుకునేందుకు జ‌గ‌న్ వేసిన కొత్త ప‌థ‌కం అన్నారు. వైసీపీ హ‌యాంలో 16 కోట్ల డీజీల్ స‌బ్సీడి బ‌కాయి న‌గ‌దును కూట‌మి ప్ర‌భుత్వం చెల్లించిందన్నారు. ఇటీవ‌ల మ‌రో 7 కోట్ల స‌బ్సీడీ న‌గ‌దును మ‌త్స్య‌కారుల‌కు అంద‌చేశామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Telangana Govt Important Update : జిల్లాల వారీగా జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ల రిజ‌ర్వేష‌న్లు

Exit mobile version