Telangana Govt : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నిర్ణీత గడువు లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ (Telangana Govt) ను ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. నేడో రేపో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్ల కేటగిరీలను , జిల్లాలను ప్రకటించింది. ఇందుకు గాను వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Govt Announced Chairmans
ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్టీ (షెడ్యల్డ్ తెగలు ) లకు ములుగు , వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలను కేటాయించింది. ఆయా జిల్లాలకు జిల్లా పరిషత్ చైర్మన్ లుగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు చైర్మన్లుగా కొలువు తీరనున్నారు. ఇక ఎస్సీలకు సంబంధించి సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల్ , వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాలలో ఎస్సీలు జడ్పీ చైర్మన్లు కానున్నారు.
వెనుకబడిన తరగతులకు (బీసీలు) సంబంధించి సిద్దిపేట, కరీంనగర్ , మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి బువనగిరి, నిజామాబాద్, వరంగల్ అర్బన్ , వనపర్తి, మహబూబ్ నగర్ , జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ , సూర్యాపేట, నాగర్ కర్నూల్ , మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ఓసీ కేటగిరీ కింద పెద్దపల్లి, జగిత్యాల్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, కుమురం భీం ఆసిఫాబాద్ , ఆదిలాబాద్ , మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్లకు కేటాయించారు.
Also Read : IAS Surendra Mohan Growth : వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్
