Minister Atchannaidu : అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. తాను ప్రతిపక్ష నాయకుడినంటూ పదే పదే చెప్పుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 11 సీట్లకే పరిమితమైన తనను , ఆ పార్టీకి ఎలా ప్రతిపక్ష హోదా దక్కుతుందంటూ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కానే కాదని, ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమేనని స్పష్టం చేశారు. ఆఫ్ట్రాల్ ఓ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. గతంలో రాష్ట్రాన్ని ఏలిన తను ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
Minister Atchannaidu Slams YS Jagan
లక్షల కోట్ల అప్పులు చేసింది చాలక చిలుక పలుకులు పలికితే ఎలా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని జగన్ రెడ్డికి హితవు పలికారు. ఎవరైనా ప్రతిపక్ష నేత బాధితులను పరామర్శించేందుకు వెళతారని, కానీ జగన్ మాత్రం గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ లకు బానిసలైన వారిని, సమాజంలో చీడ పరుగులను పరామర్శించడానికి వెళ్లడం దారుణమన్నారు. తను కావాలని లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాట తీస్తామన్నారు. తను కావాలని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
Also Read : MP Kiran Kumar Reddy Fired on KTR : ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయి కేటీఆర్ కు లేదు
