MP Kiran Kumar Reddy Fired on KTR : ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే స్థాయి కేటీఆర్ కు లేదు

షాకింగ్ కామెంట్స్ చేసిన ఎంపీ చామ‌ల కిర‌ణ్

Hello Telugu - MP Kiran Kumar Reddy Fired on KTR

Hello Telugu - MP Kiran Kumar Reddy Fired on KTR

Kiran Kumar Reddy : హైద‌రాబాద్ – భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) నిప్పులు చెరిగారు కేటీఆర్ పై. ఉత్త‌ర కుమారుడి మాట‌లు క‌ట్టి పెట్టాల‌ని, ద‌మ్ముంటే మీ నాయిన కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకు రావాల‌ని స‌వాల్ విసిరారు. త‌మ నాయ‌కుడు సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరేంత సీన్ నీకు లేద‌న్నారు. గ‌తంలో చాలాసార్లు స‌వాళ్లు విసిరిన నువ్వు ఏనాడైనా బ‌హిరంగ చ‌ర్చ‌కు వ‌చ్చావా అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి, అర్హ‌త నీకు లేనే లేద‌న్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, తొడలు కొడితే పిచ్చోడివి అని అనుకుంటారని ఎద్దేవా చేశారు.

MP Kiran Kumar Reddy Slams KTR

ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలా ప‌డితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోర‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, గ‌త 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి, అందినంత మేర దోచుకున్నది కాక పైగా త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. దోచుకున్న సొమ్ముతో వ్య‌తిరేక ప్రచారం చేస్తే జ‌నం న‌మ్మే స్థితిలో లేరన్నారు. గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను స‌క్ర‌మ ప‌ద్ద‌తిలో పెట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం నానా తంటాలు ప‌డుతోంద‌న్నారు. అంతులేని అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డాగా మార్చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. త్వ‌ర‌లోనే అన్ని పాపాలు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.

Also Read : MLA Anirudh Reddy Promising : షోకాజ్ నోటీస్ కు స‌మాధానం ఇచ్చేందుకు సిద్దం

Exit mobile version