Minister Atchannaidu : అమరావతి – రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). మిడిమిడి జ్ఞానంతో జగన్ రెడ్డి తప్పుడు లెక్కలను ప్రజలకు చెపుతున్నాడంటూ ఆరోపించారు. గత ప్రభుత్వంలో రైతులకు జగన్ చేసిన మంచి ఏమీ లేదన్నారు. అందుకే తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. మిర్చి, పొగాకు, మామిడి, కోకో పంటలకు మద్ధతు ధరను ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఉల్లి దిగుబడి ముందుగానే వచ్చిందని, రైతులకు మెరుగైన ధర ఇచ్చామన్నారు అచ్చెన్నాయుడు. రైతులు యూరియా కోసం కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని ప్రకటించారు.
Minister Atchannaidu Slams YS Jagan
వాణిజ్య పంటలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు మంత్రి. ఐదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి నిస్సుగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉల్లి రైతులకు సమస్యలు వస్తే కనీసం సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదన్నారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. ఉల్లి ధరలపై తను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమని, అవి రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మంత్రి ఖండించారు. . వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పంటలకు సరైన ధరలు రాక రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆరోపించారు.
పంట బీమా, రుణ మాఫీ, పంట సబ్సిడీల్లో నిర్లక్ష్యం కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు చేసుకున్నారని తెలిపారు. ఎరువులు, విత్తనాల సరఫరా సక్రమంగా జరగక రైతులు నష్టపోయారని, సాగు సౌకర్యాలు, నీటి వనరుల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రైతు కష్టాలు పట్టించుకోని జగన్, ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి, వారికి అవసరమైన సహాయం అందిస్తోందని చెప్పారు.
Also Read : Amaravati Growth – CM Chandrababu : అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ
