Amaravati Growth – CM Chandrababu : అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ

ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోదం

Hello Telugu - Amaravati Growth - CM Chandrababu

Hello Telugu - Amaravati Growth - CM Chandrababu

Amaravati : అమరావతి : అమ‌రావ‌తి (Amaravati) రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో త‌న‌ నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. ఏడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహద పడుతుంది. అయితే ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకు రావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని ప్ర‌క‌టించారు సీఎం.

Amaravati Growth Updates

దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్దంగా ఉన్నాయని సీఎం ప్ర‌క‌టించారు. ఎస్పీవీ పరిధిలోని ప్రాజెక్టుల డిజైన్, రెవెన్యూ జనరేషన్ మొదలు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఎస్పీవీనే పూర్తి బాధ్యత వహించనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన టెండర్ కు సీఆర్డీఏ అథార్టీ ఆమోదించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుసంధానంగా రోడ్లు, ఫుట్ పాత్ ల నిర్మాణానికి సంబంధించిన పనులు ఇకపై మొదలు కానున్నాయి. దీంట్లో భాగంగా 53.68 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

Also Read : MLA Somireddy Fired on YS Jagan : ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదు

Exit mobile version