Minister Atchannaidu Fired on YS Jagan : రైతుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

మండిప‌డ్డ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Minister Atchannaidu : అమ‌రావ‌తి : రైతుల ప‌రామ‌ర్శ పేరుతో మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). కడప జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్ధాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని అధ్వాన్న స్థితికి నెట్టిన జ‌గ‌న్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కామెడీగా ఉంద‌న్నారు. జగన్ పాలనలోనే రైతులు వీధులపైకి వచ్చారని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏమిటో ఆయన ప్రభుత్వానికి తెలియద‌న్నారు. రైతులను ఆదుకోవాల్సిన ఆర్బీకేలను లంచాల గూళ్లుగా మార్చి అరటి, టమోటా, ఉల్లి వంటి పంటలను నేలమట్టం చేసిన ప్రభుత్వం జగన్‌దే అని మండిప‌డ్డారు. గ‌త ఐదేళ్ల పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుని, ఎంత క్షోభ‌కు గుర‌య్యారన్న విష‌యాన్ని గుర్తు చేసుకోవాల‌ని అన్నారు.

Minister Atchannaidu Slams Ex CM YS Jagan

ఎగుమతుల పేరుతో జగన్ చెబుతున్న సంఖ్యలన్నీ వంద శాతం అబద్ధం అని అన్నారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. తన హయాంలో 3 లక్షల టన్నులు ఎగుమతి చేశామని చెప్పడం పూర్తిగా కల్పితం అన్నారు. కేంద్రం నుంచి అవార్డులు తీసుకు వచ్చామన్న మాటకే ఎలాంటి రికార్డు లేదన్నారు. ఇదంతా జగన్ ప్రచార బృందం తయారు చేసిన అబద్ధాల మేళా మాత్రమే అని స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 2020–25 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పరిధ‌కి సంబంధించి మొదటి దశలో 10 యూనిట్ల కోసం ప్రభుత్వం రూ.1250.29 కోట్ల పరిపాలనా ఆమోదం కూడా జారీ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ యూనిట్లను 100% ప్రభుత్వ నిధులతో, సిడ్బీ నుండి రుణం పొంది ఏర్పాటుచేసి, అనంతరం 15 సంవత్సరాల పాటు ప్రైవేట్ భాగస్వామ్యులకు ఆపరేషన్, మెయింటెనెన్స్ కోసం అప్పగించాలనే ప్రణాళిక ఉన్నట్లు వివరించారు.

Also Read : YS Sharmila Shocking Comments : రాజ్యాంగం పుస్తకం కాదు ప్ర‌తి పౌరుడికి ద‌క్కిన వాగ్దానం

Exit mobile version