YS Sharmila Shocking Comments : రాజ్యాంగం పుస్తకం కాదు ప్ర‌తి పౌరుడికి ద‌క్కిన వాగ్దానం

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా రెడ్డి

Hello Telugu - YS Sharmila Shocking Comments

Hello Telugu - YS Sharmila Shocking Comments

YS Sharmila : విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగాన్ని తొలిచేలా నేడు గ్రంథం చుట్టూ మత చెద పురుగులు చేరాయ‌ని ఆవేద‌న చెందారు. రాజ్యాంగాన్ని తినేసి సొంత రాజ్యాంగం అమలు చేయాలని కుట్రలు పన్నుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు చేశారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు ప్రతి పౌరుడికి దక్కిన వాగ్దానం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఎలాంటి కుయుక్తులను అనుమతించేది లేదని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. రాజ్యాంగాన్ని రక్షించడంలో మొదటి స్థానంలో నిలబడటం నా కర్తవ్యం అని పేర్కొన్నారు . బుధ‌వారం విజ‌య‌వాడ‌లో ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు.

YS Sharmila Shocking Comments

దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది భారతీయుల ఆశయాలను, వారి హక్కులను, స్వేచ్ఛను, గౌరవాన్ని, న్యాయాన్ని కాపాడేది మన రాజ్యాంగమేన‌ని ఈ విష‌యాన్నిప్ర‌తి ఒక్కరు అర్థం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. పేదలైనా, ధనికులకైనా రాజ్యాంగం దగ్గర సమానమేన‌ని గుర్తించాల‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. దేశ‌ ప్రజలకు దశ-దిశ కల్పించిన పవిత్ర గ్రంథాన్ని తొలిచేందుకు కొన్ని దుష్ట శ‌క్తులు చేరాయ‌ని వాపోయారు. ఘ‌న‌మైన చరిత్రను రూపు మాపాలని చూస్తున్నాయని ఆరోపించారు. సొంత రాజ్యాంగాన్ని లిఖించాలని కుట్రలు చేస్తున్నాయంటూ భ‌గ్గుమ‌న్నారు. ప్రజల హక్కులను హరించి మత ఛాందసవాదాన్ని రెచ్చగొట్టాలని పన్నాగాలు పన్నుతున్నాయ‌ని మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

Also Read : MLA Anirudh Reddy Shocking Comments : దోచుకునేదంతా ఆంధ్రా సినీ నిర్మాతలే

Exit mobile version