AP Cabinet Approved : ఏపీ మీడియా అక్రిడిటేష‌న్ రూల్స్ మార్పు

బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Hello Telugu - AP Cabinet Approved

Hello Telugu - AP Cabinet Approved

AP Cabinet : అమ‌రావ‌తి – ఏపీ స‌ర్కార్ ఏపీలో ప‌ని చేస్తున్న మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు చెప్పింది. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గం చ‌ర్చించింది. ఈ మేర‌కు ప్ర‌తిపాదించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఏపీ మీడియా అక్రిడేష‌న్ రూల్స్ G.O Ms No.38, G. A. (I&PR) ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దాని స్థానంలో కొత్తగా రూపొందించిన‌ “కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025” ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

AP Cabinet Approved

కొత్త సమగ్ర, సమీకృత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025కు కేబినెట్ ఆమోదం కోరుతూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం (AP Cabinet) తెలిపింది. తద్వారా, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్, పబ్లిషింగ్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ మంజూరు చేయడం కోసం ఉన్న ఆంధ్రప్రదేశ్ (AP) మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2023, G.O. Ms. No. 38, GA (I&PR) శాఖ, dt.30.03.2023ను జారీ చేసిన ఉత్తర్వుల స్థానంలో క్రొత్తగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025 అమలులోకి రానుంది.

దీనిలో ముఖ్యంగా, రాష్ట్రంలోని వివిధ జర్నలిస్టు సంఘాలు అభ్యర్ధించిన మేరకు నూతనంగా రూపొందించిన మీడియా నిబంధనలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులకు అర్హత మేరకు రాష్ట్ర, జిల్లా అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం లభించనుంది. చిన్న వార్తాపత్రికల కేటగిరీకి చెందిన జర్నలిస్టులకు సహేతుక సంఖ్యలో అక్రిడిటేషన్లను మంజూరు చేసే సౌకర్యం కల్పించేందుకు ఎంపానెల్డ్ -ఎంపానెల్డ్ కేటగిరీలుగా చిన్న వార్తా పత్రికల వర్గీకరణ చేయడం జరిగింది.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమాచారాన్ని పొంది దానిని ప్రజలకు వ్యాప్తి చేయడానికి మీడియాకు అక్రిడిటేషన్ సౌకర్యం అందించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాకు విస్తరించ బడుతుంది.

ఎంతో కాలంగా జర్నలిస్టులు, వారి సంఘ ప్రతినిధులలో నెలకొన్న పలు మీమాంసలు ఈ క్రొత్త మీడియా రూల్స్ వలన తొలగనున్నాయి. క్రొత్త మీడియా అక్రిడిటేషన్ నిభందనల ప్రకారం అతి త్వరలో అక్రిడిటేషన్ మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.అలాగే, రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల నియామకం జరగనుంది. సోషల్ మీడియాకి సంబందించి కూడా ఒక పాలసీని తీసుకు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి.

Also Read : Telangana High Court Alarming : మేజిస్ట్రేట్‌లు న్యాయాధికారిగా ఆలోచించాలి

Exit mobile version