Minister Anitha Interesting Update : పోలీస్ శాఖ‌లో 6,100 పోస్టులు భ‌ర్తీ చేస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి అనిత

Hello Telugu - Minister Anitha Interesting Update

Hello Telugu - Minister Anitha Interesting Update

Minister Anitha : అమరావతి : రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Minister Anitha) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అద్భుత‌మైన సేవ‌లు అందిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇందులో భాగంగా త్వ‌ర‌లోనే వారికి తీపి క‌బురు చెబుతామ‌న్నారు. అంతే కాకుండా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు మంత్రి. త్వ‌ర‌లోనే పోలీస్ శాఖ‌లో 6,100 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో చ‌ర్చించడం జ‌రిగింద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. దేశంలోనే ఏపీ పోలీసులు అద్భుతంగా ప‌ని చేస్తున్నారంటూ మేడం కితాబు ఇచ్చారు.

Minister Anitha Key Comments

మంగ‌ళ‌వారం మంత్రి వంగ‌ల‌పూడి అనిత తుళ్లూరు డీఎస్పీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆమె పోలీసులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఎలాంటి సెల‌వులు తీసుకోకుండా రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల కోసం రేయింబ‌వ‌ళ్లు విధులు నిర్వ‌హిస్తున్న మీ అంద‌రి సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు . రైతుల త్యాగంతోనే రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పారు. కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామ‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. పోలీసుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామ‌న్నారు.

Also Read : YS Jagan Fired on AP Govt : అపార న‌ష్టం కూట‌మి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం

Exit mobile version