Minister Anitha : అమరావతి – జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నఖైదీల్లో పరివర్తన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha). శిక్షలు ముగిసిన తర్వాత వారికి మంచి జీవితం గడిపే అవకాశం కల్పించేందుకు కూటమి సర్కార్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ జైళ్ల పరిధిలో ఎన్నో పెట్రోల్ బంక్ అవుట్ లెట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Minister Anitha Key Comments on Prisoners
స్వయంగా వాటిని ఖైదీలే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. అందుతో భాగంగా తుని సబ్ జైల్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – జైళ్ల శాఖ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ అవుట్ లెట్ ను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారితో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్ , కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. అనంతరం సబ్ జైల్ లో పునర్నిర్మాణం చేసిన డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్బంగా మంత్రి వంగలపూడి అనిత. తమ సర్కార్ వచ్చాక కీలక మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. కానీ గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు అప్పులు తప్ప ఇచ్చింది ఒక్క పైసా లేదన్నారు. కానీ సమర్థవంతమైన నాయకత్వం కలిగిన చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ అభివృద్ది పరంగా పరుగులు తీస్తోందన్నారు మంత్రి.
Also Read : MLC Dasoju Sravan Kumar Shocking : ఐపీఎస్ లు, ఐఏఎస్ లు రాజ్యాంగానికి విధేయులు
