MLC Dasoju Sravan Kumar Shocking : ఐపీఎస్ లు, ఐఏఎస్ లు రాజ్యాంగానికి విధేయులు

రాజ‌కీయ నాయ‌కుల‌కు కాద‌న్న దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్

Hello Telugu - MLC Dasoju Sravan Kumar Shocking

Hello Telugu - MLC Dasoju Sravan Kumar Shocking

Dasoju Sravan Kumar : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని ఐఏఎస్ లు, ఐపీఎస్ ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
ఏ కర్మ అయితే మనం ఇక్కడ చేస్తామో, ఆ ఫలితాన్ని కూడా మనమే ఇక్కడే అనుభవించాల్సి ఉంటుందనే భ‌గ‌వ‌ద్గీతలోని వ్యాక్య‌ల‌ను ప్ర‌స్తావ‌వించారు. ఈ దేశంలో పోలీసులైనా, అధికారులైనా గుర్తుంచు కోవాల్సింది ఒక్కటేన‌ని పేర్కొన్నారు. మీరంతా డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ రాసిన భార‌త రాజ్యాంగానికి మాత్ర‌మే విధేయులుగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

Dasoju Sravan Kumar Key Comments on IAS, IPS Officers

ఏ రాజకీయ నాయకుడికో లేదా ఏ పార్టీకో బానిస‌లు కాద‌న్నారు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ (Dasoju Sravan Kumar).బ్లూ బుక్‌, సర్వీస్ కండక్ట్ రూల్స్ అన్నీ చట్టపరంగా మీ రక్షణ కోసం రూపొందించబడ్డవని తెలిపారు. అవి మీరు కార్య నిర్వాహకులుగా, ప్రజా సేవకులుగా మీ పాత్రను నిబద్ధతతో నిర్వహించేందుకు ఉద్దేశించినవని గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.

కానీ వాటిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి చెప్పాడని, మంత్రి ఆదేశించాడ‌ని నిర్దోషుల‌పై పోలీసులు అక్ర‌మ కేసులు పెడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇలా చేస్తే ప్ర‌జా కోర్టులో మీ అంత‌కు మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీలో ప్రస్తుతం ఎం జరుగుతోందో చూడండి, ఒక ఐపీఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేసే దుస్థితి వచ్చిందన్నారు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి, లాఠీలు ఝళిపిస్తు, మానసికంగా వేధిస్తున్న తెలంగాణ పోలీసులకు రేపు పైన పేర్కొన్న దుస్థితి రాదా అని నిల‌దీశారు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్.

టీ న్యూస్ కార్యాయంలో పోలీసులు జరిపిన విచారణ వీడియోలు సీఎం ఛానెల్ బిగ్ టీవీ కి ఎలా రిలీజ్ అయ్యాయని ఫైర్ అయ్యారు. రిలీజ్ చేసింది పోలీసులు కాదా?? ఇది చట్టబద్ధమా లేక రాజకీయ కుతంత్రానికే సంకేతమా అని నిల‌దీశారు.

Also Read : Telangana CS – Court Shocking Notice : తెలంగాణ సీఎస్ కు హైకోర్టు నోటీసులు

Exit mobile version