Minister Anam Interesting Comments : కేంద్రం నిధుల‌తో స్థానిక సంస్థ‌లు బ‌లోపేతం

మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి కామెంట్స్

Hello Telugu - Minister Anam Interesting Comments

Hello Telugu - Minister Anam Interesting Comments

Minister Anam : అమ‌రావతి – కేంద్ర ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకే అందించి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్న గొప్ప ప్రభుత్వం తమదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam) పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరు కాగా, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఆనంద్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన హాజరయ్యారు. రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, తల్లికి వందనం పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ కావలి ఎం ఎల్ ఎ కృష్ణారెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

Minister Anam Ramanarayana Reddy

ఈ సందర్భంగా మంత్రి ఆనం (Minister Anam) మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల సమస్యలపై జడ్పిటిసి సభ్యులు అర్థవంతమైన రీతిలో చర్చించడం సంతోషకరమన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల సభ్యులకు గౌరవం, విలువ ఇచ్చే ప్రభుత్వమని, వారికి గౌరవ వేతనం మంజూరులో జరుగుతున్న జాప్యం సహించరానిదని వెంటనే జిల్లా పరిషత్ అధికారులు సమన్వయంతో కృషిచేసి గౌరవ వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. స్థానిక సంస్థల నిధులను వాడుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని తెలిపారు. అదే విధంగా జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన నిర్మాణాలను పూర్తిచేసి సచివాలయ వ్యవస్థను పురోగతిలోకి తీసుకు వస్తామన్నారు.

అలాగే గత ప్రభుత్వ నిర్వాకంతో మూలన పడిన జల్ జీవన్ మిషన్ పనులను పూర్తిచేసి జిల్లా లోని గ్రామీణ ప్రాంతాల్లోని 4 లక్షల కుటుంబాలకు మంచినీటి వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి జిల్లాలోని 3,74,345 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. త్వరలోనే రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తదితర పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి పదివేల సౌర విద్యుత్ కనెక్షన్ లను అందిస్తున్నామని, ఎస్సీ ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ లభించే ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సాంకేతిక విద్యాభివృద్ధికి ఆత్మకూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Also Read : Hyderabad Heavy Rains Shocking : భాగ్యనగరంలో దంచికొడుతున్న వానలు

Exit mobile version