Heavy Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మెహదీపట్నం, మణికొండ, టోలిచౌకి, షేక్‌పేట్, గోల్కొండ, అత్తాపూర్, లంగర్‌హౌస్, బంజారాహిల్స్, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలు, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, మియాపూర్, మూసాపేట్, బాలానగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డలో భారీ వర్షం పడుతోంది. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, హకీంపేట్, కంటోన్మెంట్ ప్రాంతాల్లోనూ వర్షం కారణంగా జనజీవనం ప్రభావితమవుతుంది. పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడి, రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad Heavy Rains
అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, హకీంపేట్, కంటోన్మెంట్ ప్రాంతాల్లోనూ వర్షం మోత మోగుతోంది. వర్షంతో కూడిన ఈదురుగాలుల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. మెట్రో పిల్లర్ల కింద పలువురు వాహనదారులు తలదాచుకుంటూ గడిపారు. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండటంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను అప్రమత్తం చేయగా, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షం తగ్గేంతవరకూ ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
రెండు రోజులు వర్ష సూచన:
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రేపు (శనివారం) వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం, రహదారులపై నీటి ప్రవాహం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధికార యంత్రాంగం మునిసిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోంది.
Also Read : Morning Habits Must Effective : మీరు ఉదయం లేచిన తర్వాత చేసే పనులే మీ జీవనశైలికి మూలం
