Minister Anam : ప్రకాశం జిల్లా -రాష్ట్రంలో ఆలయాల అభివృద్ది కోసం ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. సుపరిపాలనకు తొలి అడుగు లో భాగంగా కనిగిరి నియోజకవర్గం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 మంది అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరంగా అనేక మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. ప్రధానంగా తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధూప దీప నైవేద్యాలకు నిధులు ఇస్తున్నామన్నారు.
Minister Anam Ramanarayana Reddy Key Comments
రూ. 26,24,532/- లను వైద్య సహాయం నిమిత్తం కోసం చెక్కులను అంద జేశారు మంత్రి ఆనం (Minister Anam), ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి. కనిగిరి నియోజకవర్గం లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంరతం మీడియాతో మాట్లాడారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam). చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ సంవత్సర కాలంలో దేవాదాయ శాఖ లో అనేక వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలోని ఆలయాలకు దూప దీప నైవేద్యం పధకం, అలాగే కొన్ని ఆలయాలకు సిజిఎఫ్ నిధులను దేవాదాయ శాఖ ద్వారా విడుదల చేశామని చెప్పారు. 11 జిల్లాల్లో మొదటి విడతగా 30 నియోజకవర్గాల్లో 109 దేవాలయాలకు దూపదీప నైవేద్యాలు పథకాల కింద నిధులు రిలీజ్ చేశామన్నారు ఆనం రామ నారాయణ రెడ్డి.
రెండవ విడతగా మరొక్క 21 జిల్లాలకు, 70 నియోజకవర్గాల్లో 320 దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. సి జిఎఫ్ నిధులును మొదటి విడతగా మొదటి 19 జిల్లాల్లో 36 నియోజకవర్గాలలో 73 దేవాలయాలకు 117.43 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. సిజిఎఫ్ నిధులను రెండవ విడతలో 25 జిల్లాల్లో 76 నియోజకవర్గాలకు 133 దేవాలయాలకు గాను 106.32 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తన నియోజకవర్గం లోని ఆలయాల అభివృద్ధి కోసం కొన్ని ప్రతిపాదనలు పంపించారని, వాటన్నిటిని పరిశీలించి, త్వరలోనే నిధులు విడుదల చేయిస్తానని ప్రకటించారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : పోలవరంపై ఏపీ సర్కార్ నిర్లక్ష్యం – షర్మిల
