Minister Anam Important Comments : అన్ని దానాల‌లో కెల్ల అన్నదానం గొప్ప‌ది

మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి

Hello Telugu - Minister Anam Important Comments

Hello Telugu - Minister Anam Important Comments

Minister Anam : చిత్తూరు జిల్లా – అన్ని దానాల‌లో కంటే అన్న దానం గొప్ప‌ద‌న్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. బుధ‌వారం ప్ర‌ముఖ దేవాల‌యం కాణిపాకం వ‌ర‌సిద్ది వినాయ‌క స్వామి ఆల‌యంలో నూత‌నంగా నిర్మించిన అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థాని ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Minister Anam Ramanarayana Reddy Key Comments

నూతన అన్న ప్రసాద భవనం ప్రారంభించిన తుదుపరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam) వంటశాలను కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం అన్నవితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంత‌రం మీడియ‌తో మాట్లాడారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. సుదూర ప్రాంతా ల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున ఇక్క‌డికి త‌ర‌లి వ‌స్తుంటార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే అన్న దానం కొన‌సాగుతుంద‌న్నారు.

ఎంతో ఇబ్బందులు ప‌డి ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్న‌దానం కోసం ప్ర‌త్యేకంగా భ‌వ‌నాన్ని నిర్మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇటీవ‌లే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి ఆల‌యంలో సీఎం ఆదేశాల మేర‌కు అన్నదానం కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక దేవాల‌యాల అభివృద్ది, వ‌స‌తి సౌక‌ర్యాల‌పై దృష్టి సారించామ‌ని చెప్పారు ఆనం రామ రామ నారాయ‌ణ రెడ్డి.

Also Read : Donald Trump Shocking Comments : మోదీపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version