భారతియార్ యూనివర్సిటీ సభ్యురాలిగా సంఘ‌మిత్ర‌

నామినేట్ చేసిన గ‌వ‌ర్న‌ర్ ఆర్. వి. అర్లేక‌ర్

hellotelugu-Sanghamitra

చెన్నై : భారతియార్ యూనివర్సిటీ సిండికేట్ సభ్యురాలిగా సీనియర్ విద్యావేత్త డాక్టర్ సంఘమిత్రను నామినేట్ చేశారు గవర్నర్ ఆర్.వి. అర్లేకర్. కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన సీనియర్ విద్యావేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఎ. సంఘమిత్రకు కీల‌క ప్రాధాన్య‌త పోస్టులో నియమించారు. ఆమె ప్రస్తుతం భారతియార్ యూనివర్సిటీలోని ‘ఉమెన్స్ కేర్ సెంటర్’ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్ల బోధన, 35 ఏళ్ల పరిశోధన అనుభవం కలిగిన త‌ను ఆరోగ్యం, వైద్య ఆర్థికశాస్త్రం, మానవ వనరుల ఆర్థికశాస్త్రం, ప్రవర్తనా ఆర్థికశాస్త్రం వంటి అంశాలలో నిపుణురాలు. సమర్థవంతమైన ప్రాజెక్ట్ డైరెక్టర్ , పరిశోధన సమన్వయకర్తగా ఆమె యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ , ఐసీఎస్ఎస్ఆర్ వంటి ప్రముఖ జాతీయ సంస్థల ఆర్థిక సహకారంతో తొమ్మిది ప్రధాన పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. సంతానలేమి సమస్య ఉన్న వివాహిత మహిళల చికిత్స విధానాలు, ఆర్థిక వ్యయాలు, పట్టణ ప్రాంతాల్లోని మధుమేహ వ్యాధిగ్రస్తుల కుటుంబాలలో ఆరోగ్య సంరక్షణ అవసరాలు, బీమాపై అవగాహన, ట్రాన్స్‌జెండర్ వర్గాల ఉపాధి, ఆరోగ్య సంరక్షణ వ్యయాలు, అలాగే క్యాన్సర్ రోగుల ఆర్థిక పరిస్థితులు , వారు ఎదుర్కొనే సవాళ్లు వంటి అంశాలపై ఆమె ప్రధాన పరిశోధనలు సాగాయి.

పరిశోధన పర్యవేక్షణ, మార్గదర్శకత్వం (మెంటార్‌షిప్)లో ఆమె విశేష కృషి చేశారు. ఆమె 22 మంది పీహెచ్ డీ పరిశోధకులు, 24 మంది ఎంఫీఎల్. పరిశోధకులు, 80 మంది ఎంఏ స్థాయి పరిశోధన ప్రాజెక్టులకు విజయవంతంగా మార్గదర్శకత్వం వహించారు. అసంక్రమిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, మహిళలకు వచ్చే క్యాన్సర్లు, మహిళా ఆంకాలజీ, ఆయుర్వేద ఆరోగ్య పర్యాటకం , ప్రాచీన సంగం సాహిత్యంలో ఆర్థిక భావనలు వంటి కీలక అంశాలపై ఆమె పర్యవేక్షణలో పరిశోధనలు జరిగాయి. అనేక అవార్డులను గెలుచుకున్నారు సంఘ‌మిత్ర. బోధన, పరిశోధన, పరిపాలన, ప్రజా సేవ, సాహిత్యం , సామాజిక అభివృద్ధి రంగాలలో అందించిన బహుముఖ సేవలు, ఆమె విశిష్ట విద్యాపరమైన నాయకత్వాన్ని, సామాజిక శ్రేయస్సు పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.

Exit mobile version