Donald Trump Shocking Comments : మోదీపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్

ఆయ‌న అద్భుత‌మైన వ్య‌క్తి ఎలా అవుతారు

Hello Telugu - Donald Trump Shocking Comments

Hello Telugu - Donald Trump Shocking Comments

Donald Trump : అమెరికా – దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌ధాని మోదీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను అద్బుత‌మైన వ్య‌క్తి అంటూ ఓ వైపున ప్ర‌శంసిస్తూనే మ‌రో వైపు తాను సుంకాల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యానికి భ‌య ప‌డ్డాడ‌ని ఎద్దేవా చేశారు. దీంతో త‌ను క‌ట్టుబ‌డి ఉండేందుకు ఒప్పుకున్నాడంటూ బాంబు పేల్చాడు. ఇప్ప‌టికే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య యుద్దాన్ని తానే ఆపానంటూ ప‌దే ప‌దే చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సంఘర్షణను ముగించడంలో తన పాత్ర గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు.

Donald Trump Shocking Comments on PM Modi

భార‌త్ ప్ర‌ధానంగా ఆయిల్ కోసం ర‌ష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. ర‌ష్యా నుంచి చైనా కూడా ఆయిల్ ను దిగుమ‌తి చేసుకుంటున్నా అమెరికా మాత్రం ఇండియాపై క‌న్నెర్ర చేశారు. ఆపై సుంకాలు విధించారు. ఏకంగా 50 శాతానికి పైగా. దీనిపై భార‌త్ తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. అయినా ప‌ట్టించు కోలేదు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఇంకోసారి గ‌నుక ప్ర‌శ్నిస్తే సుంకాల రేట్ల‌ను మ‌రింత పెంచుతానంటూ మోదీని హెచ్చ‌రించారు. దీనిపై పీఎం స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇంకో వైపు చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఒప్పుకోలేదు దేశ విదేశాంగ శాఖ మంత్రి.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే తన ప్రచారం ప్రపంచ యుద్ధం కాదు, కానీ అది ఆర్థిక యుద్ధం కావచ్చ‌ని అన్నారు డొనాల్డ్ ట్రంప్. చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలవడానికి లేదా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి ఆయన వేర్వేరు గడువులను నిర్దేశించారు.

Also Read : Beauty Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్నా సాంగ్ సూప‌ర్

Exit mobile version