Minister Anam : సోమశిల : చుట్టు పక్కల ఉన్న ఐదు జిల్లాల కంటే 150 టీఎంసీల నీటిని నిలువ చేసుకున్న సామర్థ్యం నెల్లూరు జిల్లాకే ఉందన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam) . ఆదివారం సోమశిల జలాశయం నుండి 5, 6 గేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేసి గంగమ్మకు జల హారతిని ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జలాశయం సామర్థ్యాన్ని తొలత అనుకున్న దానికన్నా 77 టీఎంసీల సామర్థ్యం వరకు పెంచినప్పటికీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా 74 టీఎంసీలు వరకు నీటిని నిలువ చేసుకోవడం జరుగుతున్నదని చెప్పారు. కృష్ణానది నుండి శ్రీశైలం ,నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఏర్పాటు చేయడం వలన రాయలసీమ నెల్లూరుకి నీటి నిల్వకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లాలో పర్యటించినప్పుడు కుందు నది ప్రవాహం అధికంగా ఉన్నదని అక్కడి నుంచి నీరు పెన్నా నదికి చేరుకుంటుందన్నారు.
Minister Anam Ramanarayana Reddy Comments
నేటి నుండి 20 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందని అందులో కండలేరు జలాశయానికి, తెలుగు గంగ , కనుపూరు కలువాయి కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు ఆనం రామ నారాయణ రెడ్డి. కండలేరు సామర్థ్యం 45 టీఎంసీలు ఉందని రానున్న 15 రోజులలో కండలేరు జలాశయం పూర్తిగా సామర్థ్యం మేరకు నీరు చేరుతుందని తెలిపారు. ఫ్లడ్ ఫ్లో 24000 క్యూసెక్కులు పెంచడానికి టైం పడుతుందన్నారు. టెంపుల్ టూరిజం పార్కుల ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రెవిన్యూ , ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్ష క్యూసెక్కుల పైన నీరు దాని ప్రభావం ఉంటుందని అన్నారు. ఆనం సంజీవరెడ్డి తెనాలి ద్వారా కరువు పీడిత మండలాలైన మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరుకు నీటిని అందజేసే పనులు ప్రారంభించినట్లు మంత్రి ఆనం తెలిపారు. హైపవర్ కెనాల్ ద్వారా 60 నుంచి 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
Also Read : Minister Anam Clear Instructions : విష జ్వరాలపై మంత్రి ఆనం ఆరా

















