Massive Earthquake Shocking : భారీ భూకంపం ఆఫ్గ‌నిస్తాన్ అత‌లాకుత‌లం

622 మంది దుర్మ‌ర‌ణం, 1,500కి పైగా గాయాలు

Hello Telugu - Massive Earthquake Shocking

Hello Telugu - Massive Earthquake Shocking

Earthquake : ఆఫ్గనిస్తాన్ – పెద్ద ఎత్తున భూకంపాలు ఆఫ్గ‌నిస్తాన్ ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న భారీ భూకంపం దెబ్బ‌కు ఆ దేశం అత‌లాకుత‌లం అయ్యింది. పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. తాజాగా జ‌రిగిన ఎర్త్ కేక్ (Earthquake) లో ఏకంగా 622 మంది మృతి చెందారు. 1,500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంద‌ని అధికారిక వ‌ర్గాల ద్వారా స‌మాచారం. ఈ మ‌హా విప‌త్తు గురించి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఆఫ్గ‌నిస్తాన్ కు ఎలాంటి సాయం చేసేందుకైనా తాము సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆఫ్ఘనిస్తాన్‌లో రంగంలోకి దిగారు స‌హాయ‌క సిబ్బంది, వైద్యులు.

Massive Earthquake Shocking

ఆదివారం రాత్రి 11.47 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌ను 6.0 తీవ్రతతో భూకంపం తాకింది. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌కు తూర్పు-ఈశాన్యంగా 27 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కునార్ ప్రావిన్స్‌లోని అనేక పట్టణాలు కూడా ప్రభావితమయ్యాయి ఈ ఘ‌ట‌న కార‌ణంగా. సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా , పంజాబ్ ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మ‌రో వైప తాజా నివేదికల ప్రకారం పాకిస్తాన్ లోని పెషావర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో ప్రకంపనలు సంభవించాయి. అదృష్టవశాత్తూ పాకిస్తాన్‌లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

తాలిబాన్ ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం కేవలం ఎనిమిది కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రారంభ భూకంపం తర్వాత 4 , 5 మధ్య తీవ్రతతో కూడిన అనంతర ప్రకంపనలు సంభవించాయి.

Also Read : AP Govt Shocking : ఏపీ కూట‌మి పాల‌నలో పెరిగిన నిరుద్యోగం

Exit mobile version