AP Govt Shocking : ఏపీ కూట‌మి పాల‌నలో పెరిగిన నిరుద్యోగం

లేబ‌ర్ ఫోర్స్ స‌ర్వే నివేదిక‌లో ఇండియాలో 3వ‌ది

Hello Telugu - AP Govt Shocking

Hello Telugu - AP Govt Shocking

AP Govt : అమ‌రావ‌తి – ఓ వైపు చంద్ర‌బాబు నాయుడు భారీ ఎత్తున పెట్టుబ‌డులు తీసుకు వ‌స్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. మ‌రో వైపు ఏపీ (AP Govt) ప‌రిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంటోంది. ఈ త‌రుణంలో తాజాగా లేబ‌ర్ ఫోర్స్ స‌ర్వే సంస్థ కీల‌క నివేదిక‌ను విడుద‌ల చేసింది. అత్య‌ధిక నిరుద్యోగిత రేటు ప‌రంగా చేస్తే దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ 3వ స్థానంలో ఉందని పేర్కొంది. రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి పార్టీలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాయి. ఏకంగా 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు నాయుడు.

AP Govt Shocking

ఇక లేబ‌ర్ ఫోర్స్ నివేదిక ప్ర‌కారం గ‌త ఏప్రిల్ -జూన్ 2025 మధ్యకాలంలో 29 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో నిరుద్యోగం 21శాతంగా ఉంది, ఇది జాతీయ సగటు 14.1 శాతం కంటే చాలా ఎక్కువ. కేరళలో అత్యధిక నిరుద్యోగిత రేటు 25.7 శాతం ఉండ‌గా, రాజస్థాన్ లో 21.7 శాతం. తెలంగాణ 20.1 శాతంతో నాల్గవ స్థానంలో ఉంది.

నివేదిక కూడా తీవ్రమైన లింగ అంతరాన్ని హైలైట్ చేసింది.. రాష్ట్రంలో పురుషులలో నిరుద్యోగిత రేటు 17.9 శాతం ఉండగా, మహిళల సంఖ్య 28.5 శాతం ఆందోళనకరంగా ఉంది. జాతీయ స్థాయిలో, నిరుద్యోగిత రేటు పురుషులలో 14. శాతం , మహిళలలో 16 శాతంగా ఉంద‌ని లేబ‌ర్ ఫోర్స్ రిపోర్ట్ వెల్ల‌డించింది. పట్టణ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 19.9 శాతంగా ​​ఉండగా, ఇది 23.1 శాతంగా ఉండ‌డం మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉంది.

Also Read : Shanghai Summit-Pahalgam Attack Shocking : ప‌హ‌ల్గామ్ దాడిని ఖండించిన షాంఘై స‌ద‌స్సు

Exit mobile version