Mantha Cyclone Sensational in AP : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు త‌ప్ప‌ని ముప్పు

దూసుకు వస్తున్న మంతా తుఫాన్

Hello Telugu - Mantha Cyclone Sensational in AP

Hello Telugu - Mantha Cyclone Sensational in AP

Mantha Cyclone : అమ‌రావ‌తి : ఏపీని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కారణంగా పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.
ఏపీలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం ఉంద‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఐఎండీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ స్ప‌ష్టం చేశారు. అక్టోబర్ 26, 27, 28, 29వ తేదీల్లో చాలా కీలకమైన రోజులు అని హెచ్చ‌రించారు. 28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారు జామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మంతా (Mantha Cyclone) తీరం దాట‌నుంద‌ని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదేన‌ని స్ప‌ష్టం చేశారు. విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం, తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ ను ముంచెత్త‌నున్నాయ‌ని వెల్ల‌డించారు.

Mantha Cyclone in AP Sensational

సముద్రం కోస్తా బాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలని స్ప‌ష్టం చేశారు ప్ర‌ఖ‌ర్ జైన్. వేట కోసం స‌ముద్రంలోకి వెళ్ల వ‌ద్ద‌ని సూచించారు. దిగువున వున్న లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు స‌ర్కార్ కు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు వీస్తాయ‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించ వలసిందిగా వాతావరణ శాఖ ఎండీ సూచించారు. దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలని హిత‌వు ప‌లికారు. మధ్య కోస్తా తో పాటు ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు.

Also Read : Jubilee Hills Bypoll Nomination Sensational : జూబ్లీ హిల్స్ బై పోల్ లో ఐదుగురు విత్ డ్రా

Exit mobile version