Jubilee Hills : హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జూబ్లీ హిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఐదుగురు విత్ డ్రా చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న నామినేషన్ విత్ డ్రా గడువు. మొత్తం 216 మంది నామినేషన్లు దాఖలు చేయగా తుది పరిశీలన అనంతరం 81 నామినేషన్లు మాత్రమే కరెక్టుగా ఉన్నాయని తెలిపారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఇదిలా ఉండగా ఎంతమంది నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటరనే విషయంపై అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బరిలో ఎందరు ఉన్నప్పటికీ కేవలం మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నెలొకొనడం విశేషం.
Jubilee Hills Bypoll Nomination Sensational
ఇప్పటి వరకు ఆయా పార్టీలు ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. దీనికి ధీటుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ పై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ ను ఎంపిక చేయగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి భార్య మాగంటి సునీతకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకాల దిలీప్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆయా పార్టీలు ప్రచారం చేసేందుకు గాను స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశాయి.
Also Read : Rohin Reddy Shocking Case : సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డిపై ఫిర్యాదు
