మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ఓటీటీలో స్ట్రీమింగ్

చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ స‌క్సెస్ మూవీగా రికార్డ్

hellotelugu-ManaShankaraVaraPrasad

హైద‌రాబాద్ : మెగా అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పింది మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ టీం. ఫిబ్ర‌వ‌రి 11 బుధ‌వారం నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, అందాల తార న‌య‌న‌తార క‌లిసి న‌టించిన బాక్సులు బ‌ద్ద‌లు కొట్టిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్ప‌టికే చిరంజీవి సినీ కెరీర్ లో అత్య‌ధికంగా వ‌సూళ్లు చేసిన మూవీగా చ‌రిత్ర సృష్టించింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. చిరంజీవి యాక్ష‌న్, న‌య‌న‌తార అందం , వెంకీ న‌వ్వుల న‌జ‌రానా సినిమాకు అస్సెట్ గా మారాయి.

ఇక వ‌రుస సినిమాలు తీస్తూ విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌న ఖాతాలో చేరి పోయింది. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సినిమాలు తీశాడు. అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. గ‌త ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేశ్, వీటీ గ‌ణేశ్ క‌లిసి న‌టించిన సంక్రాంతిక వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇది అతి త‌క్కువ కాలంలోనే రూ. 300 కోట్ల‌ను వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా ఈసారి సంక్రాంతికి వ‌చ్చిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు అన్ని సినిమాల‌ను తోసి రాజ‌ని టాప్ లో నిలిచింది.

Exit mobile version