Rangareddy A Major Road Accident Shocking : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

లారీ, బ‌స్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 17 మంది దుర్మ‌ర‌ణం

Hello Telugu - Rangareddy A Major Road Accident Shocking

Hello Telugu - Rangareddy A Major Road Accident Shocking

Rangareddy : రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో సోమ‌వారం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది మృతి చెందారు. చేవెళ్ల మండ‌లం మీర్జాగూడ గ్రామం స‌మీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సును కంక‌ర‌తో నిండిన లారీ ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కంక‌ర లారీ ఢీకొట్ట‌డంతో చాలా మంది బ‌స్సులోనే చిక్కుకు పోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు జెసిబి యంత్రాలను ఉపయోగించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా ఆర్టీసీ బ‌స్సు తాండూరు నుండి హైద‌రాబాద్ కు 70 మంది ప్ర‌యాణీకుల‌తో బ‌య‌లుదేరింది.

Rangareddy District Major Road Accident

వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆదివారం సెలవు తర్వాత తిరిగి హైద‌రాబాద్ కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో లారీ వేగంగా వెళుతూ అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో బ‌స్సులో ఉన్న ప్ర‌యాణీకులలో ప‌లువురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పేలుడు లాంటి శబ్దం వచ్చింది, దీనితో స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని చికిత్స కోసం చేవెళ్ల, హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు. అనేక మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో హైదరాబాద్-బీజాపూర్ హైవేలో భారీ ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది, చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో అనేక కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. సీనియర్ పోలీసు రవాణా శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి రెస్క్యూ, క్లియరెన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

Also Read : BCCI Huge Price to Women Cricket Team : టీమిండియాకు రూ. 51 కోట్ల న‌జ‌రానా

Exit mobile version