BCCI Huge Price to Women Cricket Team : టీమిండియాకు రూ. 51 కోట్ల న‌జ‌రానా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన బీసీసీఐ

hellotelugu-BCCIAnnounces

BCCI : ముంబై : యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా విశ్వ విజేత‌గా నిలిచిన భార‌త మ‌హిళా జ‌ట్టుకు కాసుల వ‌ర్షం కురుస్తోంది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముంబై బీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో బ‌ల‌మైన స‌ఫారీ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది భార‌త్ జ‌ట్టు. జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. వ‌ర‌ల్డ్ క‌ప్ ను ముద్దాడింది. ఈ సంద‌ర్బంగా బీసీసీఐ భారీ న‌జ‌రానాను ప్ర‌క‌టించింది. జ‌ట్టుకు, యాజ‌మాన్యానికి క‌లిపి రూ. 51 కోట్లు ప్రైజ్ మ‌నీ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఐసీసీ చైర్మ‌న్ అయిన జే షా ప్రైజ్ మ‌నీని 300 శాతం పెంచారంటూ స్ప‌ష్టం చేశారు.

BCCI Huge Price

ఇదిలా ఉండ‌గా ముంబై వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ పోరులో భార‌త్ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా టాస్ ఓడి పోయి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 298 ప‌రుగులు చేసింది. షెఫాలీ వ‌ర్మ 87 ర‌న్స్ చేయ‌గా స్మతీ మంద‌న్నా 45 ప‌రుగుల‌తో కీ రోల్ పోషించింది. దీప్తి శ‌ర్మ దుమ్ము రేపింది. 58 బంతులు ఎదుర్కొని 58 ర‌న్స్ చేసింది. అనంత‌రం 299 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవ‌ర్ల‌లోనే 246 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో భార‌త్ జ‌గ‌జ్జేత‌గా అవ‌త‌రించింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాణించారు షెఫాలీ వ‌ర్మ‌, దీప్తి శ‌ర్మ‌లు. సెఫాలీ 2 వికెట్లు తీస్తే దీప్తి 5 వికెట్లు కూల్చింది.

Also Read : Popular Cricketer Kane Williamson : టీ20 ఫార్మాట్ కు కేన్ మామ గుడ్ బై

Exit mobile version