Hero Mahesh Babu : భారీగా పెరిగిన ‘ప్రిన్స్’ నిక‌ర ఆస్తుల విలువ‌

ఇత‌ర హీరోల‌తో పోటీ ప‌డి సంపాద‌న

Hello Telugu - Hero Mahesh Babu

Hello Telugu - Hero Mahesh Babu

Mahesh Babu : ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో కూల్ గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లి పోయే న‌టుల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు (Mahesh Babu). ఆయ‌న పుట్టిన రోజు ఇటీవ‌లే జ‌రుపుకున్నారు కుటుంబీకుల మ‌ధ్య‌. ఆయ‌న పూర్తిగా కుటుంబానికే ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీలో న‌టిస్తున్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా కొత్త పోస్ట‌ర్ ను ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. ఇది నిమిషాల్లోనే వైర‌ల్ గా మారింది.

భారతీయ సినిమా మహేష్ బాబును అతని అసాధారణ నటన, తెరపై ఆధిక్యతతో గుర్తించింది. అపారమైన సంపదను సంపాదించాడు. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించాడు. విలాసవంతమైన ఆస్తులు, దాతృత్వ ప్రయత్నాలు, విలాసవంతమైన జీవనశైలి కారణంగా పరిశ్రమలో ఐకాన్ గా మారాడు.. మహేష్ బాబు, భార్య, మాజీ బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ లు ఇండియాలోనే అత్యంత సంపన్న సెలబ్రిటీ జీవిత భాగస్వాములలో ఒక‌రుగా గుర్తింపు పొంది ఉన్నారు.

Mahesh Babu Properties

మహేష్ (Mahesh Babu) మొత్తం నికర విలువ సుమారు రూ.400 కోట్లుగా అంచనా వేయబడింది, ఎందుకంటే అతను ఒక చిత్రానికి ఆశ్చర్యకరంగా రూ.80 కోట్లు వసూలు చేస్తాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. కూతురు సితార కూడా ప్ర‌క‌ట‌నల్లో క‌నిపిస్తోంది. త‌ను విలాస‌వంత‌మైన కార్ల‌ను క‌లిగి ఉన్నాడు. అంతే కాకుండా ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. రూ.50 కోట్ల విలువ చేసే విలాస‌వంత‌మైన భ‌వ‌నం కూడా హైద‌రాబాద్ లో ఉంది. బెంగ‌ళూరు, ముంబై , త‌దిత‌ర న‌గ‌రాల‌లో కూడా ఆస్తుల‌ను క‌లిగి ఉన్నాడు మ‌హేష్ బాబు.

జూబ్లీ హిల్స్ లోని ఇల్లు విలువ రూ. 28 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. త‌న వ‌ద్ద వానిటీ వ్యాన్ ఉంది. దీని ధ‌ర రూ. 6.2 కోట్లు. రూ. 1.12 ల‌క్ష‌ల ఆడి ఏ8, రూ. 92 ల‌క్ష‌ల విలువ చేసే ట‌యోటా ల్యాండ్ క్రూయిజ‌ర్ , రూ. 2.1 కోట్లు చేసే రేంజ్ రోవ‌ర్ వోగ్ , రూ. 2.80 కోట్ల విలువ చేసే గ‌ల్లార్డో రూ. 82. 08 కోట్ల వాల్యూ చేసే బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. ఇటీవ‌లే రూ. 1.19 కోట్ల‌కు ఆడి ఇ ట్రాన్ ఎల‌క్ట్రిక్ ఎస్ యు వీని కొనుగోలు చేశాడు.

Also Read : Zelensky Reject : ట్రంప్ ప్ర‌తిపాద‌న జెల‌న్ స్కీ తిర‌స్క‌ర‌ణ

Exit mobile version