Zelensky : ఉక్రెయిన్ – తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ దేశ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Zelensky). రష్యాతో ప్రాదేశిక మార్పిడిపై ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించారు. గత కొన్ని రోజులుగా వరుసగా రష్యాతో యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారీ ఎత్తున ఉక్రెయిన్ ఆస్తులను, దేశ పౌరులను కోల్పోయింది. ఉక్రెయిన్ శాంతి ఒప్పందంలో భాగంగా రష్యాకు భూభాగాన్ని వదులు కోవాలని డొనాల్డ్ ట్రంప్ సూచనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ గట్టిగా తిరస్కరించారు.
Zelensky Reject
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ ఆక్రమణదారునికి భూమిని ఎట్టి పరిస్థితుల్లో అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రష్యా తన దురాక్రమణకు ప్రతిఫలమిచ్చే ఉద్దేశ్యం లేదని నొక్కి చెప్పారు. రష్యా తమ పట్ల అత్యంత ద్వేష పూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. అందుకే తాము కూడా దాడులకు పాల్పడాల్సి వచ్చిందని చెప్పారు. వాళ్లు చేసిన దురాక్రమణకు తాము ఏమైనా అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు.
హత్యలకు విరామం ఇవ్వడం కాదు, నిజమైన, శాశ్వత శాంతిని వెంటనే సాధించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు జెలెన్ స్కీ. ఇప్పుడు నాల్గవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంఘర్షణను ముగించడానికి, దౌత్య మార్గాలను చర్చించడానికి ఉక్రేనియన్ , యూరోపియన్ ఉన్నత అధికారులు ఇంగ్లాండ్‌లోని కెంట్‌లో US ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : Instagram New Innovation : ఇన్‌స్టాగ్రామ్ లవర్స్ కు ఖుష్ కబర్
