Mahavatar Narasimha : భారతీయ సినీ చరిత్రలో పౌరాణిక దృశ్య కావ్యంగా తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మహావతార్ నరసింహా దుమ్ము రేపుతోంది. బాక్సులు బద్దలు కొడుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో ఆశించిన దానికంటే అత్యధికంగా వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకు పోతోంది. ఏకంగా మహావతార్ నరసింహా (Mahavatar Narasimha) ఇప్పటికే రూ. 275 కోట్లు దాటేసింది. ప్రస్తుతం రూ. 300 కోట్ల క్లబ్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో దేశ వ్యాప్తంగా ఏకంగా 4,800 షోలు ప్రదర్శిస్తోంది ఈ చిత్రం. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద పౌరాణిక దృశ్య కావ్యంగా మలిచిన మూవీ మహావతార్ నరసింహ తన తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తోంది.
Mahavatar Narasimha Movie Trending Collections
ఆగస్టు 14న కేవలం 1,300 షోలతో మాత్రమే ప్రదర్శితమైనప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన పునరాగమనం చేసింది. బలమైన ప్రేక్షకుల డిమాండ్ , మౌత్-ఆఫ్-మౌత్ టాక్ ఆధారంగా ఇది భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో థియేటర్లలోకి తిరిగి వచ్చింది. ప్రదర్శనల సంఖ్య పెరుగుదల దాని బాక్సాఫీస్ ఊపును గణనీయంగా పెంచుతుందని, ఈ సంవత్సరంలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా దాని హోదాను మరింత పటిష్టం చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి.
దీంతో ఈ చిత్రం టాప్ బ్లాక్‌బస్టర్‌లలో దాని స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో టాప్ లో కొనసాగుతున్నాయి సైయారాతో పాటు మహావతార్ నరసింహా మూవీస్.
Also Read : Botsa Satyanarayana Fired on AP Govt : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం – బొత్స
