Botsa Satyanarayana : విశాఖపట్నం – మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ (Botsa Satyanarayana) నిప్పులు చెరిగారు ఏపీ కూటమి ప్రభుత్వంపై. ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూనే లోలోపల టెండర్లు ఎలా పిలుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆదివారం బొత్స మీడియాతో మాట్లాడారు. ఏం పాపం చేశారని వికలాంగుల పెన్షన్లలో కోత పెట్టారంటూ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఊరికే రాలేదన్నారు. 38 మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిందన్నారు. ఈ సంస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి వేలాది కుటుంబాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఒకవేళ కాదని ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఎవరి కోసం పని చేస్తున్నారో తను ఆలోచించు కోవాలని అన్నారు.
Botsa Satyanarayana Slams AP Govt
తన వ్యక్తిగత ప్రచారం కోసం తప్పా ఆయన వల్ల ఏపీకి ఒరిగింది ఏమీ లేదన్నారు. పాలన పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ. ఆదిశగా ఆలోచించడం అత్యంత హేయ్యమైన చర్యగా ఆయన అభివర్ణించారు. విశాఖ ఉక్కు పరిశ్రమప్రైవేటీకరణ ప్రక్రియ ఆందోళనకరమైన దశకు చేరుకుందన్నారు. 32 శాఖల్లో కుదుపులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణ ఊపందుకున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ సహా కీలక నాయకులు మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సందర్బంగా ప్రైవేటీకరణ చేయబోమంటూ బీరాలు పలికిన పవర్ స్టార్ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు బొత్స సత్యనారాయణ.
Also Read : Hyderabad Traffic Block : 27 వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
