Maganti Sunitha Nomination Interesting : బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా మాగంటి సునీత నామినేష‌న్

షేక్ పేట త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో దాఖ‌లు

Hello Telugu - Maganti Sunitha Nomination Interesting

Hello Telugu - Maganti Sunitha Nomination Interesting

Maganti Sunitha : హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియ‌జ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిగా బుధ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు మాగంటి సునీత‌ (Maganti Sunitha). షేక్ పేట త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ అంద‌జేశారు. ఆమె వెంట ఆమె వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, టీ. పద్మారావు గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఈ సంద‌ర్బంగా మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. తన భ‌ర్త లేక పోవ‌డం ప‌ట్ల భావోద్వేగానికి లోన‌య్యారు. ఆయ‌న ఇంత త్వ‌ర‌గా చ‌ని పోతార‌ని అనుకోలేద‌న్నారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని ఆమె జూబ్లీ హిల్స్ ఓట‌ర్ల‌కు విన్న‌వించారు.

Maganti Sunitha Nomination Filed

ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవ‌లే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పార్టీ త‌ర‌పున త‌న భార్య‌కే టికెట్ ఖ‌రారు చేశారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్. నిన్న త‌న నివాసంలో మాగంటి సునీత‌కు బి – ఫామ్ స్వ‌యంగా అందించారు. అంతే కాకుండా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున రూ. 40 వేల చెక్కును కూడా ఇచ్చారు. మ‌రో వైపు జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా క్రిమిన‌ల్ కేసులు క‌లిగిన న‌వీన్ యాద‌వ్ ను నిల‌బెట్టగా బీజేపీ త‌రున లంకాల దీప‌క్ రెడ్డిని బ‌రిలో ఉంచారు.

Also Read : BJP Approved Deepak Reddy : జూబ్లీహిల్స్ బై పోల్ లో బీజేపీ అభ్య‌ర్థిగా దీప‌క్ రెడ్డి

Exit mobile version