ముంబై : బాలీవుడ్ బ్యూటీగా పేరు పొందిన మాధురీ దీక్షిత్ రూట్ మార్చేశారు. గతంలో నటించి ఒక వెలుగు వెలిగిన వారంతా సహాయక పాత్రల్లో నటిస్తుంటే ఇంకొందరు నయా ట్రెండ్ కు తెర తీసిన వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. దీపం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఇంకో వైపు ఫుల్ బిజీగా మారి పోయారు మాధురీ దీక్షిత్ బుల్లి తెరపై ప్రసారం అయ్యే రియాల్టీ షోలలో. తాజాగా తను ఎవరూ ఊహించని క్యారెక్టర్ చేస్తూ ముందుకు వచ్చింది వెబ్ సీరీస్ లో. దాని పేరు మిసెస్ దేశ్ పాండే. ఇది పూర్తిగా తను గతంలో చేయని భిన్నమైన పాత్ర. తన అభిమానులను కూడా విస్తు పోయేలా చేసింది అలనాటి , నేటి అందాల తార.
సీరియల్ కిల్లర్ ను డామినేట్ చేసేలా ఉంది తన పాత్ర. ఈ వెబ్ సీరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. తాజాగా మిసెస్ దేశ్ పాండే వెబ్ సీరీస్ ట్రైలర్ వచ్చేసింది. మరీ భయపెట్టేలా ఉంది ధక్ ధక్ మాధురీ దీక్షిత్. నాగేశ్ కుకునూర్ ఈ సీరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ లో సీమా దేశ్ పాండే పాత్రను పోషిస్తోంది. గతంలో 2022లో ది ఫేమ్ గేమ్ సీరీస్ లో నటించింది మాధురీ దీక్షిత్. తాజా సీరీస్ లో మాజీ రెస్టారెంట్ యజమాని, హత్యల పట్ల ఆందోళన కలిగించే ఆసక్తి ఉన్న వ్యక్తిగా నటించింది. సీమా దేశ్ పాండే ఎనిమిదిని చంపేసినప్పటికీ కేవలం ఒక నేరానికి మాత్రమే దోషిగా నిర్థారించబడడం ఎందుకో తెలుసు కోవాలని అనుకుంటు మాధురీ కీ రోల్ పోషించిన మిసెస్ దేశ్ పాండే వెబ్ సీరీస్ చూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=dh-Vzwftf4E
