Lok Sabha 3 Important Bills : పార్ల‌మెంట్ లో మూడు కీల‌క బిల్లులు

లోక్ స‌భ వ‌ర్షాకాల స‌మావేశాల‌లో చ‌ర్చ‌కు

Hello Telugu - Lok Sabha 3 Important Bills

Hello Telugu - Lok Sabha 3 Important Bills

Lok Sabha : ఢిల్లీ – పార్ల‌మెంట్ ముందు మూడు కీల‌క‌మైన బిల్లులు చర్చ‌కు రానున్నాయి. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ ఎంపీ, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న దొంగ ఓట్ల‌కు సంబంధించి లేవ‌దీసిన ప్ర‌శ్న‌లు, ఆరోప‌ణ‌ల గురించి మ‌రోసారి ప్ర‌స్తావించ‌నున్నారు. ఇదే క్రమంలో
మూడు ముఖ్యమైన బిల్లులను చర్చించే అవకాశం ఉంది. ఎజెండాలో అనేక కమిటీల నివేదికలు, కేంద్ర మంత్రుల ప్రసంగాలు, ముఖ్యమైన చట్టాలపై చర్చలు ఉంటాయి. ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నల ప్రత్యేక జాబితా తయారు చేశారు ఇప్ప‌టికే. వీటికి సంబంధించి స‌మాధానాలు ఇవ్వాల్సి ఉంటుంద‌ని సంబంధిత శాఖ‌ల మంత్రుల‌కు తెలియ చేశారు.

Lok Sabha Pass 3 Important Bills

కాగా సభలో మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్, జయంత్ చౌదరి, పంకజ్ చౌదరి, కీర్తివర్ధన్ సింగ్ , సుకాంత మజుందార్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.. జాతీయ క్రీడా పాలన బిల్లు 2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025, భారత ఓడరేవుల బిల్లు 2025 పై చర్చలు జ‌రిపేందుకు స‌భ్యులు ప‌ట్టుప‌ట్టారు.

విదేశీ వ్యవహారాలపై ఎనిమిదవ నివేదికను లోక్‌సభలో (Lok Sabha) సమర్పించ నుండ‌డం ప్ర‌ధానంగా మారింది.
శశి థరూర్ , అరుణ్ గోవిల్ అధ్యక్షతన భారతదేశ హిందూ మహాసముద్ర వ్యూహం మూల్యాంకనం పై విదేశీ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ రిపోర్టు స‌మ‌ర్పించ‌నుంది. ఆర్థికంపై స్టాండింగ్ కమిటీ తరపున భర్తృహరి మహతాబ్, నెహ్రూ 25వ నివేదికను సమర్పించనున్నారు. రైల్వేలపై స్టాండింగ్ కమిటీ కోసం, సి.ఎం. రమేష్, భోలా సింగ్ రెండు నివేదికలను సమర్పించనున్నారు.

Also Read : Rahul Gandhi Shocking : రాహుల్ గాంధీకి షాక్..క‌ర్ణాట‌క సీఈవో నోటీసులు

Exit mobile version