Rahul Gandhi : కర్ణాటక – కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా రాహుల్ (Rahul Gandhi) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆయా రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల కమిషన్ ను తప్పు పట్టాయి. దీంతో కర్ణాటక ఎన్నికల కమిషన్ తమపై ఆరోపణలు చేసినందుకు గాను ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఒకరి పేరుతో డబుల్ ఓటర్లు నమోదై ఉన్నాయని, ఒక ఇంట్లో 40 ఓట్లు, మరొకరి నివాసంలో 80 ఓట్లు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Karnataka CEO Given Notice to Rahul Gandhi
డబుల్ ఓటింగ్ దావాపై కర్ణాటక CEO రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద తప్పుడు ప్రకటనలు శిక్షార్హమైనవని హెచ్చరించింది. నోటీసులలో పేర్కొంది. తప్పుగా చేర్చబడిన లేదా మినహాయించ బడిన ఓటర్ల పేర్లను, ప్రతి కేసుకు సంతకం చేసిన ప్రమాణంతో పాటు సమర్పించాలని CEO రాహుల్ గాంధీని కోరారు. బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఒక మహిళ 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు ఓటు వేశారనే తన ఆరోపణలకు రుజువు అందించాలని నోటీసులలో పేర్కొన్నారు సీఈఓ. ఇదిలా ఉండగా శకున్ రాణిగా గుర్తించబడిన ఒక ఓటరు రెండుసార్లు తన ఓటును వేసిందని, ఇది పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా తారుమారుకి రుజువుగా ఉందని రాహుల్ పేర్కొన్నారు.
Also Read : Israel Attack – AL Jazeera : జ్రాయెల్ దాడిలో ఆల్ జజీరా జర్నలిస్టులు మృతి
