Liver Dangerous Foods : ఈ 5 రకాల వస్తువులు తిన్నారంటే మీరు యాసిడ్ తాగినట్టే

ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలు పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి...

Hello Telugu - Liver Dangerous Foods

Hello Telugu - Liver Dangerous Foods

Liver : శరీరంలోని అత్యంత కీలక అవయవాలలో కాలేయం (లివర్) ఒకటి. ఇది విషకారకాలను తొలగించటం, పోషకాలను శోషించటం, రక్తాన్ని శుభ్రపరచటం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, అసమతుల ఆహారం కారణంగా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, లివర్ (Liver) క్యాన్సర్ వంటి సమస్యలు పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి.

Liver – ఫ్యాటీ లివర్ నుంచి క్యాన్సర్ దాకా…

ఆధునిక జీవనశైలిలో ఫ్యాటీ లివర్ (Liver) సమస్య సాధారణమైపోయింది. అయితే ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తాజా నివేదిక ప్రకారం, ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వారిలో సుమారు 7 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

క్యాన్సర్‌కు దారితీసే ఆహారాలు – ప్రజల్లో అవగాహన అవసరం

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని ఆహార పదార్థాలను పరిమితంగా తీసుకోవడం అత్యవసరం. ముఖ్యంగా కింది ఐదు రకాల ఆహారాలు కాలేయానికి హానికరం కాగా, దీర్ఘకాలంగా ఇవి క్యాన్సర్‌కు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు:

1. ప్రాసెస్ చేసిన మాంసం:

ఇటువంటి మాంసంలో అధిక కొవ్వు, ఇనుము ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను పెంచి, కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

2. మద్యం (ఆల్కహాల్):

అధిక మద్యం వినియోగం వల్ల మొదట ఫ్యాటీ లివర్, అనంతరం సిర్రోసిస్, చివరికి క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతాయి.

3. అధిక చక్కెర:

మితిమీరిన చక్కెర వాడకంతో శరీరంలోని సెల్‌లు నష్టపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కాలేయంపై గణనీయంగా కనిపిస్తుంది.

4. జంక్ ఫుడ్స్:

ఫ్రైడ్ ఐటెమ్స్, ప్రాసెస్డ్ స్నాక్స్‌ వంటి వాటి వినియోగం వల్ల నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

5. అధిక ఉప్పు:

ప్రాసెస్ ఫుడ్స్, పికిల్స్‌లో ఉండే అధిక ఉప్పు కాలేయ వాపును పెంచుతుంది. దీని వలన కాలేయ కణజాలానికి నష్టం కలగొచ్చు.

ఇతర ప్రమాదకర అలవాట్లు:

ధూమపానం, అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం కూడా కాలేయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలే రక్షణ:

కాలేయ ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం, మితమైన జీవనశైలి, వ్యాయామం, మద్యం నివారణ వంటి చర్యలు తీసుకోవడం అవసరం. అలాగే, రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు ద్వారా కాలేయ పరిస్థితిని గమనించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read : Fake Apple Shocking Facts : మీరు ఆపిల్ తినే ముందు ఇవి తప్పక చూసుకోవాలి

Exit mobile version