Lakshma Reddy : హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం పోరాడుతుందని, కాపాడుతుందని బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన నిబద్ధతను నిరూపించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి (Lakshma Reddy) జోక్యంతో సుమారు 15 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చెర నుంచి బయట పడ్డాయి.
BRS Leader Lakshma Reddy Save
ప్రభుత్వానికి చెందిన ఈ భూములపై కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో కన్నేశారని గుర్తించారు. ఆ వెంటనే హుటా హుటిన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు. కోర్ట్ లో వేసిన కేసు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అరెకపూడి గాంధీ 15 ఎకరాల భూమిని అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నం బయట పడింది. మొత్తం 317 ఎకరాల భూముల రక్షణ కోసం ఈ అంశం నేరుగా హైకోర్టు దాకా తీసుకు వెళ్లాల్సి వచ్చింది.
WPSR/42482/2025, CNR HBHC010569562025 నంబరుతో, B vs. State పేరుతో ఈ కేసు సెప్టెంబర్ 19న దాఖలయ్యాక, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకుంది. ఇది కేవలం భూముల రక్షణకే మాత్రమే పరిమితం కాదు. పేద, బలహీన వర్గాల హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి ఇది ఒక నిదర్శనం అని పేర్కొన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడటంలో ఎప్పుడూ రాజీ పడలేదని రాగిడి లక్ష్మారెడ్డి మరోసారి నిరూపించారు. ఈ సందర్బంగా లక్ష్మా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్.
Also Read : GST Important Update : జీఎస్టీ 2.0: ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం
