KTR Interesting : రామ‌న్న‌కు రాఖీ క‌ట్టిన ల‌గ‌చ‌ర్ల బిడ్డ‌లు

త‌మ‌కు క‌ష్ట కాలంలో అండ‌గా ఉన్నార‌ని

Hello Telugu - KTR Interesting

Hello Telugu - KTR Interesting

KTR : హైద‌రాబాద్ – త‌మ‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు తీవ్ర ఇబ్బందులు పెట్టిన స‌మ‌యంలో త‌మ‌కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినందుకు మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు రాఖీ క‌ట్టారు కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌గ‌చ‌ర్ల‌కు చెందిన తాండాకు చెందిన మ‌హిళ‌లు. ప్రభుత్వం త‌మ‌ భూములు గుంజుకొని త‌మ‌ భర్తను జైలుకు పంపి అన్ని వైపులా దాడులు చేస్తుంటే కేటీఆర్ సొంత అన్న కంటే ఎక్కువ‌గా నిల‌బ‌డ్డాడ‌ని కొనియాడారు. నిండు గర్భిణిగా ఉన్న నా క్షేమాలన్నీ చూసుకున్నాడ‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యింది ఆడబిడ్డ జ్యోతి. నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టిండు. కేటీఆర్ నాకు దేవుడు ఇచ్చిన అన్న అని తెలిపింది.

KTR Appreciates

రాష్ట్రంలో ఆపదలో ఉన్న ఆడబిడ్డలు అందరికీ కేటీఆర్ అన్నగా నిలబడుతున్నాడని పేర్కొన్నారు గిరిజన సోదరీమణులు. కేటీఆర్‌కు కొడంగల్ నుండి భారీగా త‌ర‌లి వ‌చ్చారు గిరిజన సోదరీమణులు . రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, తమకు అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు ఈ రాఖీ కట్టామని వారు తెలిపారు.

కొడంగల్ మండలం, లగచర్ల గ్రామం, రోటిబండ తండాకు చెందిన జ్యోతి, మరికొంతమంది మహిళలు ఈరోజు కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారని, ఆమె భర్తను జైలుకు పంపిన, సమయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి, జ్యోతితో పాటు లగచర్ల గిరిజనులకు, పేద రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఎండగట్టారు.

దీని ఫలితంగా, ప్రభుత్వం భూసేకరణను వెనక్కి తీసుకుందని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలు పాలైన లగచర్ల సోదర సోదరీమణులందరికీ కేటీఆర్ అన్నగా అండగా నిలబడి, న్యాయ సహాయం అందించారని, అందరినీ జైలు నుంచి విడిపించారని వారు తెలియజేశారు.

Also Read : Minister Prataprao Jadhav Interesting : ఆయుష్ వైద్యాభివృద్దికి కేంద్రం ఆర్థిక సాయం

Exit mobile version