Kurnool Bus Incident Important Update : బ‌స్సు ఘ‌ట‌న‌కు సంబంధించి కంట్రోల్ రూమ్స్

ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన జిల్లా క‌లెక్ట‌ర్

Hello Telugu - Kurnool Bus Incident Important Update

Hello Telugu - Kurnool Bus Incident Important Update

Kurnool : క‌ర్నూలు జిల్లా : క‌ర్నూలు జిల్లా లోని కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. సిరి. శుక్ర‌వారం ఆమె ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించారు. ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. మొత్తం 41 మంది బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్నార‌ని వీరిలో 21 మంది సురక్షితంగా బ‌య‌ట ప‌డ్డార‌ని చెప్పారు. మిగ‌తా 20 మందికి గాను 11 మందిని గుర్తించామ‌ని తెలిపారు. ఇంకా మృత దేహాల‌ను గుర్తించాల్సి ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మృతుల కుటుంబాల కోసం వివ‌రాలు తెలియ చేసేందుకు గాను జిల్లా క‌లెక్ట‌రేట్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామ‌న్నారు.

Kurnool Bus Incident Control Rooms

ఇదిలా ఉండ‌గా కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలుప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075 , కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ 9494609814, 9052951010 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని కోరారు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. సిరి. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేయాల‌ని తెలిపారు.

Also Read : Kurnool Collector Siri Important Update : బ‌స్సు ఘ‌ట‌న‌లో 21 మంది సుర‌క్షితం

Exit mobile version