Kurnool Collector Siri Important Update : బ‌స్సు ఘ‌ట‌న‌లో 21 మంది సుర‌క్షితం

ప్ర‌క‌టించిన క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ సిరి

Hello Telugu - Kurnool Collector Siri Important Update

Hello Telugu - Kurnool Collector Siri Important Update

Kurnool Collector Siri : క‌ర్నూలు జిల్లా : క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న కావేరి వోల్వో బ‌స్సు ద‌గ్ధం ఘ‌ట‌న కేసుకు సంబంధించి కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. సిరి. (Kurnool Collector Siri) శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు క‌లెక్ట‌ర్ కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. 24 వ తేది తెల్లవారుజామున 3 నుంచి 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ అయ్యింద‌న్నారు.

Kurnool Collector Siri Comments

ఇందులో 21 మంది ప్ర‌యాణీకులు బ‌తికి బ‌య‌ట ప‌డ్డార‌ని చెప్పారు డాక్ట‌ర్ ఎ. సిరి. మిగిలిన 20 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండగా ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది మృత దేహాల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు జిల్లా క‌లెక్ట‌ర్. మిగిలిన వారిని కూడా గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం గాయ‌ప‌డిన వారు క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని, వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఎప్ప‌టిక‌ప్పుడు ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, సీఎస్ విజ‌యానంద్ కు తెలియ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Also Read : Minister Satya Kumar Yadav Shocking Update : మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ న‌మూనాల‌ సేకరణ

Exit mobile version